మ‌రింత ముందుకొచ్చిన‌ `అఖండ‌`..కొత్త రిలీజ్ డేట్ ఇదే..?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

- Advertisement -

Akhanda' first single out: Nandamuri Balakrishna, Pragya Jaiswal's 'Adigaa Adigaa' is a magical melody | Telugu Movie News - Times of India

ఇక ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రం మ‌రింత ముందుకొచ్చింద‌ని తెలుస్తోంది.

Akhanda' Gears Up for Final Schedule! – Jyothi Chitra

డిసెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచ‌న‌ల్లో అఖండ మేక‌ర్స్ ఉన్నార‌ని.. దాదాపు అదే తేదీని ఖ‌రారు చేస్తార‌ని స‌మాచారం. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించి ప్ర‌మోష‌న్స్ సైతం షురూ చేయ‌నున్నార‌ని టాక్‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాలి.

Share post:

Popular