రవితేజ‌ను జుట్టు ఊడేలా చిత‌క‌బాదిన న‌టి.. అస‌లేమైందంటే?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను జుట్టు ఊడిపోయేలా చిత‌క‌బాదిందో న‌టి. ఆమె ఎవ‌రో కాదు.. జయ వాణి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ర‌వితేజను స్టార్ హీరోల చెంత‌ చేర్చిన చిత్రం `విక్రమార్కుడు`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రావితేజ కాంబోలో తొలిసారి తెర‌కెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా న‌టించింది.

ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 2006లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు అనే ఘరానా దొంగగా, సెకెండాఫ్‌లో విక్రం సింగ్ రాథోడ్ అనే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా రెండు విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించి రవితేజ అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు.

ఇక ఈ చిత్రంలో ఆడవాళ్ళతో గొడవపడే సీను ఒక హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన ఈ సీన్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ జయ వాణి కూడా న‌టించింది. అయితే ఈ సీన్ చేసేట‌ప్పుడు ర‌వితేజ‌ను కొట్టేందుకు ఆడ‌వాళ్లు ఎంతో ఇబ్బంది ప‌డ్డార‌ట‌. దాంతో ర‌వితేజ.. `అమ్మా..! ఇది మంచి సీన్.. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కొట్టండి. నేను కొడతా..ఈ సీన్ చేసేటప్పుడు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు` అని చెప్పారట‌.

దాంతో థైర్యం తెచ్చుకున్న న‌టి జయ వాణి ఆ స‌న్నివేశంలో ర‌వితేజను జుట్టు ఊడిపోయేలా చిత‌క‌బాదింద‌ట‌. మ‌రోవైపు ర‌వితేజ సైతం ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా త‌న పాత్ర‌లో జీవించాడ‌ట‌. అందుకే ఆ సీన్ అంత బాగా వ‌చ్చిందని జ‌య వాణి గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Share post:

Latest