రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందే పలు రికార్డులను తనపేరిట రాసుకుంటోంది.

ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో హిందీ భాషలో ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా రిలీజ్ చేసేందుకు అక్కడి బయ్యర్లు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కోసం నార్త్ ఇండియాలో ఏకంగా 3500 స్క్రీన్స్‌ను లాక్ చేసి పెట్టారట. ఇంత పెద్ద సంఖ్యలో ఓ సౌట్ ఇండియా కోసం స్క్రీన్స్‌ను రెడీ చేసి పెట్టడం ఇదే తొలిసారి. ఇలా ప్రభాస్ క్రేజ్ నార్త్ ఇండియాలో మరింత పెంచేస్తున్నారు అక్కడి దర్శకనిర్మాతలు.

పూర్తిగా ఫిక్షనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Share post:

Popular