బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే డేట్ లీక్‌..నెట్టింట వైర‌ల్‌!

November 21, 2021 at 8:10 pm

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మూడు నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే మూడోసారి కూడా బిగ్‌బాస్ స్టేజ్‌పై సంద‌డి చేస్తున్నారు. ఇక‌ మొత్తం 19 మంది కంట‌స్టెంట్ల‌తో స్టార్ట్ అయిన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu Season 5: Only 3 Contestants Are Popular

ప్ర‌స్తుతం ప‌ద‌కొండొ వారం కొన‌సాగుతుండ‌గా.. కాజ‌ల్‌, స‌న్నీ, ష‌ణ్ముఖ్‌, శ్రీ‌రామ్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియాంక‌, మాన‌స్‌, ఆనీ మాస్ట‌ర్‌, సిరిలు హౌస్‌లో కొన‌సాగుతున్నారు. వీరిలో టాప్-5కి ఎవ‌రు చేర‌తారు..? విన్న‌ర్ ఎవ‌రు అవుతారు..? అన్న విష‌యాలు ప‌క్క‌న పెడితే.. బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలేకి డేట్ ఫిక్స్ చేశార‌ట మేక‌ర్స్‌.

Bigg Boss 5 Telugu: ఆమె అంత గుర్తొస్తే వెళ్ళిపో.. ఆ కంటెస్టెంట్‌కు  వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. | Bigg boss 5 telugu latest episode nagarjuna  serious on siri and shanmukh | TV9 Telugu

లీకుల వీరుల స‌మాచారం ప్ర‌కారం.. బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను వచ్చే డిసెంబర్ 19 కి కన్ఫర్మ్ చేశార‌ని అంటున్నారు. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియ‌దు గానీ.. ప్ర‌స్తుతం ఆ డేట్ మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక‌ ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ఫుల్ క్లారిటీ ఇవ్వ‌నున్నారు.

 

బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే డేట్ లీక్‌..నెట్టింట వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts