బిగ్‌బాస్ 5లో ఆనీ మాస్ట‌ర్ సంపాద‌న తెలిస్తే మైండ్‌బ్లాకే?!

November 22, 2021 at 7:02 pm

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం పూర్తై.. ప‌న్నెండో వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. ప‌ద‌కొండో వారం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఆనీ మాస్టర్ బ్యాగ్ స‌ద్దేసింది.

Anee: Bigg Boss Telugu 5 contestant Anee Master's profile, photos and  everything you need to know about the choreographer-TV judge - Times of  India

బిగ్ బాస్ హౌస్‌లో 11 వారాలు ఉన్న ఆనీ మాస్ట‌ర్.. వెళ్తూ వెళ్తూ భారీగా రెమ్యూన‌రేష‌న్‌ను ప‌ట్టికెళ్లింది. సెలబ్రిటీల పాపులారిటీని బట్టి బిగ్‌బాస్‌ టీమ్‌ ఒక్కో కంటెస్టెంటుకు ఒక్కో రకంగా రెమ్యునరేషన్‌ ఇస్తుంది. అయితే ఆనీ మాస్ట‌ర్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర ఆమెకు ముట్ట‌చెబుతామ‌ని నిర్వాహ‌కులు అగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌.

Bigg Boss Telugu Season 5 Elimination 20th November 2021 Written Update, Anee  Master and RJ Kajal in Danger Zone

ఇక ఈ లెక్క‌న ఆనీ మాస్ట‌ర్ బిగ్‌బాస్ హౌస్‌లో ప‌ద‌కొండు వారాల‌కుగానూ రూ.30 ల‌క్ష‌ల‌కు పైగా సంపాదించింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, హౌస్‌లో అవసరం ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడే ఆనీ మాస్టర్.. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారితే మాత్రం బహిరంగంగానే అందరి ముందు నోటి దురుసు ప్రదర్శిస్తుంది.

Bigg Boss Telugu-5: ఈ 5 కారణాల వల్లే "అనీ మాస్టర్" ఎలిమినేట్ అయ్యారా.?

ఈ విష‌యం ఇంటి స‌భ్యుల‌కే కాదు ప్రేక్ష‌కుల‌కు సైతం ఏ మాత్రం న‌చ్చ‌లేదు. దీంతో ఆమె ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని బుల్లితెర ఆడియెన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేశారు. ఇక ఎట్ట‌కేల‌కు ఈ వారం ఆనీ మాస్టర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

బిగ్‌బాస్ 5లో ఆనీ మాస్ట‌ర్ సంపాద‌న తెలిస్తే మైండ్‌బ్లాకే?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts