నవ్వు తెప్పిస్తున్న ‘జూనియర్ నారా’ వారి మాటలు

రాజకీయాలు రాకపోతే నేర్చుకోవాలి..ఇంకా ముందుకువెళ్లి వంటబట్టించుకోవాలి.. ఎప్పుడేం మాట్లాడాలో తెలియాలి.. లౌక్యంగా ఉండాలి..ఇలా ఉంటాయి సాధారణంగా రాజకీయ నాయకుల వ్యవహారాలు..అయితే నారా లోకేష్ మాత్రం ఇంకా రాజకీయాలు వంటబట్టించుకున్నట్లు లేదు. తన తండ్రి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోన్నట్టు ఉన్నాడు.. ఇంకా తండ్రి చాటు బిడ్డలాగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన మాటలు.. చేతలు చూసి తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారట. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ బుధవారం పర్యటించారు. కోవిడ్ కాటుకు బలైన వారి కుటుంబాలను పరామర్శించారు. మంచిదే.. నాయకుడికి ఉండాల్సిన లక్షణమిదే… అయితే అక్కడ కూడా ఏం మాట్లాడాలనే విషయంపై ఆయనకు క్లారిటీ లేదు.

మొన్న అసెంబ్లీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ సభ్యులు అవమానపరిచారని, ఆయన భార్యను అగౌరవంగా మాట్లాడారని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. దీనికి టీడీపీ శ్రేణులు మరో జాయింట్ యాడ్ చేసి ఆందోళనలు చేశాయి. అదీ ఒక్కరోజే.. ఆ తరువాత అందరూ దీనిని మరచిపోయారు. రాష్ట్రంలో భారీ వర్షాలు రావడం, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు అతలాకుతలం కావడం తెలిసిందే. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా వాడి..వేడిగా జరుగుతున్నాయి. మీడియాలో ఇవే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారంపై సీఎం మాట్లాడిన సంగతిని అన్ని పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. ఏపీలో రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే విషయంపై సీఎం మాట్లాడారు.. పాత బిల్లును రద్దుచేసి సరికొత్తగా వస్తాం ని చెప్పారు. మాట్లాడింది సీఎం.. విషయం రాజధాని.. అందుకే అంత ప్రాధాన్యత ఉన్నది ఆ విషయానికి. రాజకీయాల్లో ఓనమాలు కూడా రాని వ్యక్తికి కూడా దాని ఇంపార్టెన్స్ తెలుసు. మరి లోకేష్ కు ఇంకా ఇది ఎందుకు అర్థం కాలేదనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. తన తల్లిని అవమానించి.. ఆ తరువాత ఆ విషయాన్ని ప్రజలనుంచి డైవర్ట్ చేసేందుకే రాజధానిపై జగన్ మాట్లాడారని బుధవారం లోకేష్ విమర్శించారు. ఆయన మాటలకు ఎలా స్పందించాలో అర్థంకాక తెలుగు తమ్ముళ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఆ ఏడుపు విషయాన్ని ఎందుకు ఇలా లాగుతాడు అని వాళ్లలోల వారు మాట్లాడుకున్నారట. ఇలాగే ఆయన కంటిన్యూ అయితే ఎన్నికల నాటికి పార్టీని ఎలా లీడ్ చేస్తాడో? అని టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారట.