నయనతార ఫిట్నెస్ మంత్ర ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో హీరోల హవా ఎప్పటికీ తగ్గదు అని చెప్పాలి.. కానీ హీరోయిన్లు మాత్రం రెండు మూడు సంవత్సరాలకే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.. అయితే అలా తమ కెరీర్ ను కొనసాగించాలని ఎంతో మంది హీరోయిన్లు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, నాటికీ నేటికీ సంవత్సరాలు గడిచినా కూడా రోజురోజుకీ తమలో అందాన్ని పెంపొందించుకుంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.. వారు చేసే వర్క్ ఔట్స్ నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి, ఈ రోజు ఇంత అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నయనతార కూడా మొదట్లో ఎంత అందంగా ఉండేదో.. ఇప్పుడు ఇంకా మరింత అందంగా కనిపిస్తోంది.. అయితే తన అందం, ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యం ఏమిటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం..

Nayanatara About Her Relationships - Telugu Bullet

నయనతార తన మజిల్స్ బలంగా ఉండడానికి అందుకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు కూడా చేస్తోందట.. అంతేకాదు బరువు తొందరగా పెరగకుండా ఉండడానికి కూడా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఉంటుందట.. ప్రతిరోజు మరిచిపోకుండా యోగా చేస్తోందట. అంతేకాదు తను అందంగా ఉండడానికి కూడా కారణం ఈ యోగా అని ఆమె చెప్పడం విశేషం. తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు, డైట్ ప్లాన్ ఫాలో అవడం ,వ్యాయామం ఇలాంటివన్నీ చేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇంత అందంగా ఉన్నానని చెబుతోంది నయనతార.