దానిపై మోజుప‌డిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..త్వ‌ర‌లోనే కొనేస్తాడ‌ట‌!

November 22, 2021 at 8:35 pm

`పెళ్ళిచూపులు` సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ రౌడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అర్జున్ రెడ్డి తో యూత్‌లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత గీత గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయిన విజ‌య్‌.. ప్ర‌స్తుతం డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

బాక్సాంగ్ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో కీలక పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా హార్స్ రైడ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ అందుకు సంబంధించిన పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫాలోవ‌ర్స్‌తో పంచుకున్నాడు.

అంతేకాదు, తనకుగుర్రాలు అంటే చాలా ఇష్టమని, త్వరలోనే ఓ గుర్రాన్ని సొంతం చేసుకుంటాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. మొత్తానికి గుర్రంపై మోజుప‌డిన రౌడీ హీరో.. త్వ‌ర‌లోనే దానికి య‌జ‌మాని కూడా కానున్నాడు. కాగా, టాలీవుడ్‌ హీరోల్లో చాలా మంది హీరోల‌కు హార్స్ రైడింగ్ వ‌చ్చ‌న్న సంగ‌తి తెలిసిందే.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కైతే సొంతంగా రెండు గుర్రాలు ఉన్నాయి. అందులో ఒకదాని పేరు బాద్షా కాగా మరోదాని పేరు కాజల్. వీటిల్లో కాజ‌ల్ పేరుగ‌ల గుర్రాన్ని రామ్ చ‌ర‌ణ్, రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కిన `మ‌గ‌ధీర‌` చిత్రంలో వాడారు.

దానిపై మోజుప‌డిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..త్వ‌ర‌లోనే కొనేస్తాడ‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts