కృష్ణంరాజు మొదటి భార్య ఎలా మ‌ర‌ణించారో మీకు తెలుసా?

సీనియ‌ర్ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పెద‌నాన్న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. తెలుగునాట విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులైన‌ కృష్ణంరాజు.. కెరీర్ స్టార్టింగ్‌లో కొద్ది రోజులు ప్రెస్‌లో ప‌ని చేశారు. ఆ త‌ర్వాత సినిమాల‌పై ఉన్న ఇంట్ర‌స్ట్‌తో సినీ గ‌డ‌ప తొక్కారు.

Krishnam Raju is in ICU

ఇక ఎన్నో వంద‌ల చిత్రాల్లో న‌టించి తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గజ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న‌ కృష్ణంరాజు భార్య ఎవ‌రూ అంటే ట‌క్కున అంద‌రూ శ్యామలా దేవి అని చెప్పేస్తారు. అది నిజ‌మే కానీ, కృష్ణంరాజుకు శ్యామ‌లా దేవి మొద‌టి భార్య కాదు. ఈ విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

నిజానికి శ్యామ‌లా దేవి కంటే ముందు కృష్ణంరాజు మ‌రొక‌రిని వివాహం చేసుకున్నారు. అస‌లు ఇంత‌కీ ఎవ‌రామె..? ఆమె ఏం అయ్యారు..? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణంరాజు మొట్ట మొద‌ట‌ సీతాదేవి అనే యువ‌తిని వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఒక కుమార్తె కూడా జ‌న్మించింది. అంతా సాఫీగా జ‌రిగిపోతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో ఓ కారు యాక్సిడెంట్‌లో సీతాదేవి మృతి చెందారు.

Krishnam Raju daughter Praseedha entry with Prabhas Radhe Shyam

ఆమె మ‌ర‌ణ వార్త కృష్ణంరాజును తీవ్రంగా కృంగ‌దీసింది. కొన్నాళ్ల పాటు ఆయ‌న డిప్రెష‌న్‌లోకి కూడా వెళ్లిపోయారు. ఇక ఆ త‌ర్వాత కుటుంబ స‌భ్యుల సాయంతో డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ్డ ఆయ‌న‌..శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్లెలు ఉన్నారు.

Share post:

Latest