కూతురికి అద్భుత‌మైన బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

November 22, 2021 at 9:00 am

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారి చేసే హంగామాకు అల్లు ఫ్యాన్సే కాదు నెటిజ‌న్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇక అర్హ న‌ట‌న‌లోనూ అడుగు పెట్టింది. ఈమె న‌టిస్తున్న తొలి చిత్రం `శాకుంతలం`.

Allu Arjun Celebrates Arha Birthday At Burj Khalifa - Sakshi

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అర్హ భ‌ర‌తుడి పాత్ర‌లో అల‌రించ‌బోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. నిన్న అర్హ అరో పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా కూతురికి జీవితాంతం గుర్తుండేపోయే అద్భుత‌మైన గిఫ్ట్ ఇచ్చాడు బ‌న్నీ. అర్హ బ‌ర్త్‌డేను ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫాలో జ‌ర‌పాల‌ని భావించాడు బ‌న్నీ.

Allu Arjun Celebrates Arha's Birthday At Burj Khalifa

ఇక అనుకున్నదే తడవు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చెక్కేశాడు. అనుకున్న‌ట్లే బుర్జ్‌ ఖలీపాపై అర్హతో కేక్‌ కట్‌ చేయించి గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు జరిపాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. దీంతో బుర్జ్‌ ఖలీపాపై ఈ రేంజ్‌లో బర్త్‌డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

Allu Arha birthday party at Burj Khalifa

కాగా, బ‌న్నీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నారు.

Allu Arjun daughter Arha birthday celebration in burj khalifa at Dubai -  தமிழ் News - KARKEY

Allu Arjun Celebrates Arha Birthday At Burj Khalifa - Sakshi

 

 

కూతురికి అద్భుత‌మైన బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts