కాంగ్రెస్సోళ్లు.. అంతన్నారు.. ఇంతన్నారు.. మరి..

November 24, 2021 at 5:34 pm

వందేళ్ల చరిత్రగల పార్టీ.. ఇదే ఆ పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్పుకునే మాటలు.. అంతే.. కేవలం మాటలే.. వారి మాటలు మాత్రమే గొప్ప.. చేతలు అంతంతే.. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇదేం పార్టీనే.. అదే కాంగ్రెస్ పార్టీ.. పార్టీలో కార్యకర్తలు తక్కువ.. నాయకులు ఎక్కువ.. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో వారికే తెలియదు.. ఏమైనా అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ వచ్చిన తరువాత పార్టీలో అంతర్గతంగా అసంత్రుప్తి ఉంది. నాయకులు బయటకు చెప్పలేక.. చెబితే అధిష్టానం ద్రుష్టిలో చెడ్డకావడం ఎందుకులే అనుకుని అలాగే ఉండిపోతున్నారు. రేవంత్ మాత్రం అలా ముందుకు వెళుతున్నట్లు నటిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికలు. తెలంగాణలో 12 చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. మొత్తం 102 నామినేషన్లు దాఖలు చేస్తే అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు చోట్ల.. రెండంటే రెండు ప్రాంతాల్లోనే నామినేషన్లు వేశారు.

నామినేషన్ల ప్రక్రియకు ముందు టీపీసీసీ నాయకులు గాంధీభవన్ లో పలుసార్లు చర్చించారు.. సమావేశమయ్యారు.. అధిష్టానానికి చెబుతాం అన్నారు.. బీఫామ్స్ రెడీగా ఉన్నాయన్నారు.. పోటీచేయకపోతే పరువు పోతుందని పేర్కొన్నారు.. తీరా చివరకు వచ్చేసరికి ఏమీ లేదు.. అంతా తుస్ మనిపించారు. కనీసం 5,6 చోట్ల బరిలోకి దిగాలని భావించారు. అనుకున్నారు గానీ పోటీచేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. పోటీచేసినా గెలిచేది లేదు కదా అని వారు ముందుగానే ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్లు వేసిన ఆ ఇద్దరు కూడా తమ వ్యక్తిగత బలాన్ని చూసుకునే బరిలోకి దిగుతున్నారు తప్ప పార్టీ బలాన్ని చూసి కాదు. ఖమ్మంలో రాయల నాగేశ్వర రావు, మెదక్ లో జగ్గారెడ్డి భార్య నిర్మల మాత్రమే పోటీచేస్తున్నారు. హేమాహేమీలున్న రాష్ట్ర నాయకులు తమ జిల్లాల్లో కనీసం అభ్యర్థులను పోటీకి కూడా నిలిపే పరిస్థితి లేదు. ఇంత దారుణంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కేవలం పీసీసీ చీఫ్ మాత్రమే కేసీఆర్ పై గొంతెత్తి మాట్లాడతారు. అంతే.. ఇంక ఎవరూ మాట్లాడరు.. మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈ రెండు స్థానాల్లో అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో, లేదో..కనీసం డిపాజిట్ అయినా తెచ్చుకుంటుందో.. లేకపోతే హుజూరాబాద్ లో లాగ పరువు పోగొట్టుకుంటుందో చూడాలి.

కాంగ్రెస్సోళ్లు.. అంతన్నారు.. ఇంతన్నారు.. మరి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts