ఉదయ్ భాను.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం అభినయం స్పష్టమైన మాట తీరుతో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఉదయ్ భాను.. పలు సినిమాల్లో ఐటెం భామగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అటువంటి ఆమెను ఒకానొక సమయంలో నందమూరి బాలకృష్ణ ఏడిపించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
అనుకోని అడ్డంకుల కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఉదయ్ భాను.. 2004వ సంవత్సరంలో విజయకుమార్ అనే బిజినెస్ మెన్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2016లో ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలకు జన్మించగా.. ఉదయ్ భాను వారి మొదటి పుట్టిన రోజును ఎంతో ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకుంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఉయయ్ భాను.. బంధువులను, స్నేహితులను, తెలిసిన సినీ తారలను ఇంటికెళ్లి ఆహ్వానించిందట.
ఈ క్రమంలోనే బాలయ్యతో కూడా కాస్త సన్నిహిత్యం ఉండటంతో.. ఆయనకు `నా బిడ్డల మొదటి పుట్టిన రోజుకు మీరు తప్పకుండా వచ్చి వారిని ఆశీర్వదించాల`ని ఉదయ్ భాను మెసేజ్ చేసిందట. అయితే బర్త్‌డే నాడు ఉదయ్ భాను ఇంటింటికి వెళ్లి పిలిచిన వారెవ్వరూ పెద్దగా రాలేదట.
ఇక బాలయ్య వంటి స్టార్ హీరో ఎందుకు వస్తారులే అని ఆమె ఎంతో బాధ పడుతున్న సమయంలో.. ఎవరూ ఊహించని విధంగా బాలయ్య వచ్చి ఆమె కూతుళ్లను ఆశీర్వదించారట. దాంతో ఉదయ్ భాను ఎంతో ఎమోషనలై కంటతడి పెట్టేసుకుందట. మొత్తానికి అలా బాలయ్య ఉదయ్ భాను చేత కన్నీళ్లు పెట్టించాడు.