విద్యుల్లేఖ రామన్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఎటో వెళ్ళిపోయింది మనసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విద్యుల్లేఖ.. లేడీ కమెడియన్ గా టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
![చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరగడంతో పెద్దయ్యాక ఈమె కూడా నటి అయిపోయింది. 2012లో 19 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది విధ్యు.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/10/Vidyullekha-Raman-1.jpg)
మొదటి నుంచీ బుద్దుగా ఉండే ఈ చెన్నై చిన్నది.. గతేడాది లాక్డౌన్ సమయంలో బాగా సన్నబడిది. ఇక ఈ మధ్యే ప్రియుడు సంజయ్‌ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. తమిళ, సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహానికి చెన్నై వేదికగా నిలిచింది.
![గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాతో హాస్య నటిగా వచ్చింది విద్యుల్లేఖ రామన్. ఆ తర్వాత రన్ రాజా రన్లో అదిరిపోయే కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది. సరైనోడులో సాంబార్ కామెడీతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యు.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/10/Vidyullekha-Raman-13.jpg)
పెళ్లైన వెంటనే భర్తతో హనీమూన్ కోసం మాల్దీవులకు చెక్కేసింది. ప్రస్తుతం మాల్దీవ్స్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున విద్యుల్లేఖ.. తాజాగా బికినీలో దర్శనమిచ్చింది. విద్యుల్లేఖను బికినీలో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ లేడీ కమెడియన్ హాట్ పిక్స్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి.
![తమిళంలోనూ అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. కొన్నేళ్లుగా సంజయ్ అనే కుర్రాడితో ప్రేమలో ఉన్న విద్యు.. 2021లోనే అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే బరువు చాలా తగ్గిపోయింది ఈ భామ.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/10/Vidyullekha-Raman-12.jpg)
![కేరాఫ్ తమిళం అయినా తన ముద్దుల తెలుగుతో అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా సన్నగా మారి బికినీ ఫోటోషూట్ చేసింది విద్యుల్లేఖ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ నటుడు మోహన్ రామన్ కూతురు ఈమె.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/10/Vidyullekha-Raman-5.jpg)



