టీవీ చూసే వారికి షాకింగ్ న్యూస్.. ఇకమీదట అవి కట్..?

ప్రేక్షకులకు వెండితెర ఎంత వినోదాన్ని మనకు అందిస్తుందో తెలిసిన విషయమే. అంతకంటే ఎక్కువ వినోదాన్ని బుల్లితెర పైన కూడా మనం చూస్తూనే ఉంటాము. వాస్తవానికి అప్పుడు కంటే ఇప్పుడు టెలివిజన్ రంగం చాలా అభివృద్ధి చెందింది. అప్పట్లో వారానికి ఒక్క సినిమానే వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి.

ఇక వీటితో పాటు పలు సీరియల్స్ కూడా రావడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త సీరియల్ రానే వస్తుంది. వీటి కోసం ఆడవాళ్లు బాగా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలలో మాదిరి, ముద్దు సీన్లు, కౌగిలింతలు ఎక్కువయ్యాయి. ఎంతలా అంటే ఇవి సీరియల్స్ సినిమాలా అనేంతల మారిపోయాయి.

అందుచేతనే ఫ్యామిలీ మొత్తం సీరియల్స్ ను ఒక దగ్గర చూడలేకపోతున్నారు. ఇక ఈ సీరియల్స్ ప్రభావం గృహిణుల మీద, యువత మీద ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుచేతనే పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి సీరియల్స్ మీద దృష్టి పెట్టి వీటిని నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు ముఖ్య కారణం ప్రజల నుండి ఎక్కువ ఫిర్యాదులు రావడంతో ఇలాంటి సీన్లు ఉండకూడదని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.