మొదటి సారిగా తన కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అదిరింది షో తో గుర్తింపు తెచ్చుకొని, ఆ తరువాత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఒకవైపు యాంకర్ గా మరొకవైపు నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.

తాజాగా తొలిసారిగా తన చిన్నారిని పరిచయం చేసింది సమీరా. సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ వేదికగా తన కొడుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. మా అందాలకు చిరునామా మా బేబీ సయ్యద్ అర్హన్ ను మీకు పరిచయం చేస్తున్నాం.

చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నేను పెరుగుతున్న కొద్దీ ఆ ఇష్టం మరింత పెరిగింది. అలా నా మేనకోడలు,అల్లుళ్ళు,ఫ్రెండ్స్ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకున్నాను తెలిపింది. నా చేతుల్లో నా కన్నబిడ్డ ఉండటం అన్నది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపింది.

https://www.instagram.com/p/CVHrXKDpvqt/?utm_source=ig_embed&ig_rid=da5b2dd7-5d01-4587-a696-4b3059cb1448

దీనికి కారణమైన దేవుడికి ధన్యవాదాలు థాంక్యూ అర్హాన్ మమ్మల్ని తల్లిదండ్రులు గా సెలెక్ట్ చేసుకున్నందుకు నీకు బెస్ట్ మదర్ గానే కాకుండా బెస్ట్ ఫ్రెండ్ గా కూడా ఉంటాను మాటిస్తున్నాను అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేసింది. ఈమె అభిషేకం, ముద్దుబిడ్డ, భార్యామణి నాది సీరియల్స్ లో నటించింది.

Share post:

Latest