భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా స‌క్సెస్ కాలేక‌పోయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే!

ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషినే న‌మ్ముకుని టాలీవుడ్‌లో స్టార్స్‌గా ఎదిగిన హీరోలు ఎంద‌రో ఉన్నారు. అలాగే భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా స‌క్సెస్ కాలేపోయిన హీరోలూ ఉన్నారు. ఇంత‌కీ ఆ హీరోలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగా హీరోతో ఢీ కొడుతున్నాడా?

తారకరత్న: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ప్రజానాయకుడు ఎన్.టి.రామారావు గారి మ‌న‌వ‌డిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ నంద‌మూరి తార‌క‌త్న‌.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. విల‌న్‌గానూ ప‌లు చిత్రాల్లో న‌టించారు. కానీ, స్టార్ స్టేట‌స్‌ను మాత్రం ద‌క్కించుకోలేక‌పోయాడు.

Allu Sirish Bio, Movies, Age, Family, Wife, Net Worth & Wiki

అల్లు శిరీష్: `గౌరవం` సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అల్లు శిరీష్‌.. నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, అల్లు అర్జున్‌కి సోదరుడు మ‌రియు మెగాస్టార్ చిరంజీవికి మేన‌ల్లుడు. ఇంత‌టి బీభ‌త్స‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా శిరీష్ స‌రైన హిట్టే అందుకోలేక‌పోయాడు.

This Akkineni hero waits for a hit - TimesSouth.com

సుశాంత్: నటుడు అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వ‌డిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. కరెంట్, అడ్డా, దొంగాట ఇలా ప‌లు చిత్రాలు చేశాడు. కానీ, ఆయన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక‌పోయాడు.

Comedian And Son In Tough Situation!

గౌతమ్: స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన బ్రహ్మానందం కుమారుడే గౌత‌మ్‌. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన గౌత‌మ్‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. కానీ, ఆ త‌ర్వాత ఫేడౌట్ అయిపోయాడు.

మనోజ్ విడాకులపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్..

మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌: టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులుగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన విష్ణు, మ‌నోజ్‌లు.. స్టార్ హీరోల రేంజ్‌కి ఎద‌గ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయారు.

నాన్నగారి వల్ల పైకొచ్చారు, సాయం చేయలేదు, అంతా కమర్షియలే: ఆర్యన్ రాజేష్ | No one in the industry will help, all commercial: Aryan Rajesh - Telugu Filmibeat

ఆర్యన్ రాజేష్: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఇవివి సత్యనారాయణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఆర్య‌న్ రాజేష్‌.. కెరీర్ మొద‌ట్లో బాగానే హిట్లు అందుకున్నారు. కానీ, తండ్రి మ‌ర‌ణించాక ఆర్య‌న్ రాజేష్ సినీ కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది.