డబ్బులిస్తే తీసుకోండ‌న్న నరేశ్‌..ఎక్స్‌ట్రాలు ఆప‌మ‌న్న శ్రీ‌కాంత్‌!

`మా` వార్‌కి క్లైమాక్స్ డే వ‌చ్చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో నేటి ఉద‌యం 8 గంట‌ల నుంచీ పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పోలింగ్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌లు హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో మంచు విష్ణు ప్యానెల్‌కు స‌పోర్ట్ చేస్తున్న వీకె.న‌రేష్ ఓ వీడియో వ‌దిలాడు.

- Advertisement -

Prakash Raj and Vishnu Play Their Cards Well

అందులో `ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్‌ డబ్బులు పంచుతోంది.. ఒక్కొక్కరికి 10వేల నుంచి 25 వేల వరకు అందిస్తోంది. డబ్బు మాత్రమే గెలుస్తుందని ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ మ్యానిఫెస్టో కూడా విడుదల చేయలేదు. మా మెంబర్స్‌ని లోబరుచుకుంటున్నారు. నేను సభ్యులకు ఒక్కటే చెబుతున్నా డబ్బులిస్తే తీసుకోండి కానీ మంచు విష్ణుకు మాత్రమే ఓటు వేయండి` అంటూ న‌రేష్ చెప్పుకొచ్చాడు.

Naresh: శ్రీకాంత్‌ జోక్యం చేసుకోవడం సమంజసం కాదు: నరేశ్‌ - maa president naresh shocking comments on hero srikanth

అయితే ఈ వీడియో వ‌దిలిన కొద్ది సేప‌టికే న‌రేష్‌కు సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ కౌంట‌ర్ ఇచ్చారు. `ఇప్పుడే నరేష్‌గారి వీడియో చూశా.. ఎందుకండీ ఇంకా అబద్దాలు మాట్లాడుతారు.. మేము డబ్బులు పంచుతున్నామా? మీరు డబ్బులు వేరే వాళ్లతో పంపించి.. ప్రకాశ్ రాజ్ డబ్బులు ఇస్తాడని చిత్రీకరిస్తున్నారు.. ఆపేయండి సార్.. ఇక్కడితో ఆపేయండి. ఇంకా ఎక్స్‌ట్రాలు ఏమీ మాట్లాడవద్దు. దసరా సందర్భంగా పూజలందుకుంటున్న అమ్మవారి మీద ఒట్టేసి చెబుతున్నాం.మా లైఫ్‌లో అటువంటి కల్చర్‌లెస్ పనులు చేయం. ` అంటూ శ్రీ‌కాంత్ చెప్పుకొచ్చాడు.

Share post:

Popular