కొండపొలం సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల.. మామూలుగా లేదుగా?

వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీతి జంటగా నటించిన చిత్రం కొండపొలం. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఓ..ఓ ఓబులమ్మ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక పాటను విడుదల చేశారు చిత్ర బృందం. శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ.. ఆశలో.. పొద్దున్నే మరిచి హాయి మెశా.. అనే రొమాంటిక్ సాంగ్ లో విడుదల చేశారు.

ఈ పాటకు కీరవాణి సంగీతాన్ని అందించగా, యామిని ఘంటసాల, పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్ ల మధ్య కెమిస్ట్రీ ని బాగానే చూపించారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే ఓపెన్ ఆ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న వైష్ణవ్ తాజాగా కొండపొలం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే వదిలిన పోస్టర్ లకు పాటలకు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన వచ్చింది.

Share post:

Latest