విడాకుల తర్వాత సమంతా కొత్త సినిమా ప్రకటన?

సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ వీరిద్దరి విడాకుల విషయంలో కొత్త వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాగ చైతన్య తో విడిపోయిన సమంత ఆ తరువాత ఏం చేయనుంది? సినిమాల్లో నటిస్తుందా లేదా? ఇలా సమంత నెక్స్ట్ స్టెప్ కోసం ఆమె అభిమానులతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందని, అక్కడ వరుస ప్రాజెక్టులకు సంతకం కూడా చేయబోతుంది అంటూ వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా దసరా పండుగ రోజు సమంత తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన పోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

నేపథ్యంలోనే తాజాగా సమంత నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఇటీవల శాంకుతలం సినిమాలు నటించిన విషయం మనకు తెలిసిందే ఈ సినిమా తరువాత సమంత డ్రీమ్ వారియర్ పిక్చర్ తో చేయబోతోందట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞాన శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పోస్టర్ ని బట్టి చూస్తే సమంతా ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రం లో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే మరింత సమాచారం వెలువడనుంది.

Share post:

Popular