ఆ వ్య‌క్తికి భ‌య‌ప‌డుతున్న స‌మంత‌..క‌న్నెత్తి కూడా చూడనంటూ పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబం నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన స‌మంత‌.. తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది.

Samantha was ready to have a baby with Naga Chaitanya, reveals Shaakuntalam producer Neelima - Movies News

అలాగే రీసెంట్గా రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. మ‌రో సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సామ్ ఓ వ్య‌క్తికి భ‌య‌ప‌డుతున్నాను అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది.

WATCH: Samantha Ruth Prabhu lifts a 30 kg dumbbell which is 'half her size' | People News | Zee News

ప్ర‌స్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు ఇంత‌కీ ఆ పోస్ట్ లో ఏముందంటే..`స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవ‌రు ఇచ్చా రు. నీవు ఇక్కడ లేకపోయినా కూడా భయం వేస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను 30 కిలోల డంబెల్ వైపు కన్నెత్తి కూడా చూడను. కానీ నీ వల్ల ముప్పై కిలోల డంబెల్‌ను ఎత్తేస్తున్నాను. ఆ డంబెల్ వైపు చూడండి. నాలో సగం బరువు ఉంటుంది` అని ఫ‌నీగా చెబుతూ డంబెల్‌తో వర్కౌట్ చేస్తున్న‌ విడీయోను షేర్ చేసింది. స్నేహ దేషు.. సమంత జిమ్ ట్రైనర్.