`గాడ్ ఫాద‌ర్`లో సల్మాన్ రోల్ పై మరింత క్లారిటీ..!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

GodFather Motion Poster - Happy Birthday Mega Star Chiranjeevi | Mohan Raja  | Thaman S - YouTube

మోహన్ రాజా దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మొన్నీ మ‌ధ్యే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే..పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా క‌నిపించ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

Salman Khan Confirms Dates to Chiranjeevi

అయితే ఇప్పుడు గాడ్ ఫాద‌ర్‌లో స‌ల్మాన్ రోల్‌పై మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. ఈ చిత్రంలో ఏదో గెస్ట్ రోల్ కాకుండా ఓ బ‌ల‌మైన పాత్ర‌లోనే సల్మాన్ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే సల్మాన్ పై ఓ అదిరిపోయే సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

Share post:

Latest