సలార్ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!

October 1, 2021 at 1:04 pm

విశ్వనటుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ .. ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాదు తనకు నచ్చితేనే ఆ పాత్ర ఎంచుకుంటానని చెప్పిన శృతి హాసన్, లిమిటెడ్ గా సినిమాలను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె పాన్ ఇండియా మూవీ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి గల కారణం ఏమిటో ఇలా వివరించింది..

సలార్ లాంటి భారీ ప్రాజెక్టు సినిమాలలో నటించడం వల్ల తనతోపాటు తన లాంటి హీరోయిన్ లకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని , క్రేజ్ పెరుగుతుందని ఆమె తెలిపింది. సలార్ వంటి సినిమాల కారణంగా దేశం మొత్తం గుర్తింపు పొందవచ్చు. ఇక ఇందుకోసమే ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చని, ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆమె స్వయంగా తెలిపింది. తన పాత్ర సమయం తక్కువ అయినప్పటికీ , తన పాత్రకు మంచి గుర్తింపు వస్తుంది అని తన క్యారెక్టర్ చాలా బాగుంది అని శృతిహాసన్ తెలిపింది.

సలార్ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts