ఆర్ ఆర్ ఆర్ నుంచి సరికొత్త అప్డేట్.. అక్కడ ప్రీ రిలీజ్ వేడుకలు..!!

దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు హాలీవుడ్ నటి ఓవియా నటిస్తోన్న ఈ చిత్రం పై అటు ఎంతో మంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న చెక్కుతున్న ఈ సినిమా మరో బాహుబలి అవుతుందని అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ అంచనాలకు తగ్గట్టుగానే టైటిల్ సాంగ్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమౌళి దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాజమౌళి ఈనెల 29వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ దుబాయ్ లోనే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.