జిమ్ లో ట్రైనర్ ని ఎగిరి తంతున్న రష్మిక.. ఎందుకంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా ఆమె ఫిట్నెస్ కోసం టైమ్ కేటాయిస్తుంది. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం కనీసం వారానికి నాలుగైదు సార్లు జిమ్ లో గడుపుతుందట. ఒకవేళ జింకు వెళ్లకపోయినా కూడా యోగ అయినా చేస్తుందట.

ఈమె ఖాళీ సమయాల్లో తన సమయాన్ని ఎక్కువగా జిమ్ కోసం కేటాయింస్తుందట. ఈ నేపథ్యంలోనే ఈమె వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె వర్కౌట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా, అందులో ఫిట్నెస్ ట్రైనర్ పట్టుకున్నాడు స్ట్రైకింగ్ ప్యాడ్ ను పదే పదే పన్నుతున్నట్లు కనిపిస్తోంది.

https://www.instagram.com/p/CVXAUXNqvDX/

ఆమె ఎగిరెగిరి తన్నుతుంటే మరింత గట్టిగా తన్ను అంటూ రష్మిక ను ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్. ఇక ఇదే వీడియోని రష్మిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది.