ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చ‌ర‌ణ్‌..ఎందుకోస‌మంటే?

October 23, 2021 at 10:15 am

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

RC 15: Here's all you need to know about Ram Charan, Kiara Advani and Shankar's film | The Times of India

అయితే తాజాగా కియారాతో పూణెకు వెళ్లాడు రామ్ చ‌ర‌ణ్‌. ప‌ర్స‌న‌ల్ ప‌నిపై కాదండోయ్‌.. ప్రొఫిష‌న‌ల్ ప‌నిపైనే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్ 15వ చిత్రం.. రెగ్యులర్ షూటింగ్ పూణెలో ప్రారంభమైంది. అందుకోస‌మే చ‌ర‌ణ్‌, కియారాలు పూణె వెళ్లారు.

PHOTOS: Ram Charan looks charming as ever in a formal look as he attends an event in Hyderabad | PINKVILLA

ప్ర‌స్తుతం అక్క‌డ వారిద్ద‌రిపై ఓ సాంగ్ చిత్రీక‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. సినిమాకే హైలైట్‌గా నిల‌వ‌నున్న ఈ సాంగ్‌ను ప‌ది నుంచి ప‌దిహేను రోజుల పాటు భారీ ఖ‌ర్చు చేసి షూట్ చేయ‌నున్నార‌ని టాక్‌. కాగా, పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం అవుతోంది.

ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చ‌ర‌ణ్‌..ఎందుకోస‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts