ఆకాష్ పూరి `రొమాంటిక్‌`పై రాజ‌మౌళి రివ్యూ..?!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్ర‌మే `రొమాంటిక్‌`. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వ‌హించ‌గా.. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు.

Rajamouli: Romantic is not good .. Musalodivai poyav‌ is afraid to say you know .. Rajamouli interesting comments .. | Director rajamouli interesting comments on romantic movies after watching Special Premiere show - Heytamilcinema

ఇక భారీ అంచ‌నాల న‌డుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుద‌లైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం రొమాంటిక్‌గా రివ్యూ ఇచ్చేశారు. రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. `ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. ఇది కంప్లీట్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌.

Romantic Premier show talk increases expectations

సినిమా గురించి ఏదైనా వంక పెడితే ముసలోడివై పోయావ్‌…నీకెం తెలుసు అంటారేమోనని భయంగా ఉంది. అనిల్‌ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. ఆకాశ్‌, కేతికల జోడీ చాలా బాగుంది. ఇక ఆకాశ్‌ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా అతడిని మరోమెట్టు ఎక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ బాగా ఆకట్టుకుంది. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు` అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

Share post:

Latest