విక్ర‌మాదిత్య న‌యా రికార్డ్‌..ఉబ్బిత‌బ్బిపోతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `రాధేశ్యామ్‌`. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య‌గా, పూజా ప్రేర‌ణ‌గా క‌నిపించ‌నున్నారు. అయితే నిన్న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. మేక‌ర్స్ రాధేశ్యామ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Prabhas 20 titled 'Radhe Shyam', first look with Pooja out

`నాకు నువ్వు తెలుసు.. నీ గుండె చప్పుడూ తెలుసు.. నీ ఓటములు తెలుసు.. నీ చావు తెలుసు.. నాకన్నీ తెలుసు.. కానీ.. నేనేవీ చెప్పను. నేను దేవుణ్నీ కాను.. మీలో ఒకడినీ కాను` అంటూ విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్ అద‌ర‌గొట్టేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ టీజ‌ర్‌.. మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో న‌యా రికార్డ్ సృష్టించింది.

Radhe Shyam teaser trending No 1 on YouTube

24 గంటలు కూడా కాకముందే ఈ టీజర్ 36 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. దాంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే అత్య‌ధికంగా వ్యూస్‌ను దక్కించుకున్న టీజర్ గా రాధేశ్యామ్ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్నారు.

Share post:

Popular