`పుష్ప` థర్డ్ సింగిల్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. మేక‌ర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు.

Pushpa Movie: Third Single Nuvvu Ammi Ammi Antunte Song Released - Sakshi

ఇప్పటికే విడుదలైన దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా థ‌ర్డ్ సింగిల్ ` సామీ సామీ` కూడా వ‌చ్చేసింది. `నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ` అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

హీరోను ఉద్దేశిస్తూ హీరోయిన్ పాడే ఈ మాస్ బీట్ సాంగ్‌లో ర‌ష్మిక ప‌ల్లెటూరి అందాలు మ‌రియు ఆమె డ్యాన్స్ ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ సాంగ్ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, ద్ర‌బోస్ మ‌రోసారి అద్బుత‌మైన లిరిక్స్ తో తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాసిన ఈ పాట‌ను మౌనిక యాదవ్ ఆల‌పించ‌గా.. దేవిశ్రీ ట్యూన్ అందించారు.

Share post:

Latest