ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన పునీత్‌..రోదిస్తున్న ఫ్యాన్స్‌!

లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్‌.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌నే కాదు.. యావ‌ర్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది.

E-Conclave Corona Series: Puneeth Rajkumar talks about how he is dealing with the lockdown - Movies News

అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్‌.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో పునీత్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు మంచి స్పంద‌నే వ‌చ్చింది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో పునీత్‌.. త‌న‌కు తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్ట‌మ‌ని..అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్, రాజమౌళిల సినిమాలు ఎక్కువ‌గా చూస్తాన‌ని చెప్పుకొచ్చారు.

ಕನ್ನಡಿಗರ ಕಣ್ಮಣಿ 'ಅಪ್ಪು', 'ರಾಜಕುಮಾರ' ಪುನೀತ್ ಇನ್ನಿಲ್ಲ; ತೀವ್ರ ಹೃದಯಾಘಾತದಿಂದ ವಿಧಿವಶ- Kannada Prabha

అలాగే డైరెక్ట్‌ తెలుగు సినిమాలు చేసేందుకు తాను ఎంతో ఆస‌క్తిగా ఉన్నాన‌ని తెలిపిన పునీత్‌..ఈ ఏడాది గానీ వచ్చే ఏడాది గానీ ప్యాన్ ఇండియన్ సినిమా తీయబోతోన్నట్టు చెప్పుకొచ్చాడు. కానీ ఆ కోరిక తీరకుండానే పునీత్ రాజ్ కుమార్ అందరినీ వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ విష‌యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయ‌న ఫ్యాన్స్ గుండెలు ప‌గిలేలా రోదిస్తున్నారు.

Share post:

Popular