‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ జోరు..టెన్ష‌న్‌లో మంచు విష్ణు!

హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌లో నేటి ఉద‌యం నుంచి మధ్యాహ్నం వ‌ర‌కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు జ‌రగ‌గా.. తీవ్ర ఉత్కంఠ నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి అవ్వ‌గా.. మొద‌ట ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌ బోణీ కొట్టి జోరు చూపిస్తోంది.

MAA Elections : మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌.. రాత్రి 8 గంటలకు ఫలితాలు...

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి, అనసూయ విజయం సాధించారు. ఈ ఫలితంతో ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మ‌రోవైపు త‌న‌ ఫ్యానల్ స‌భ్యులు ఇంకా బోణీ కొట్ట‌క పోవ‌డంతో మంచు విష్ణుతో ఫుల్ టెన్ష‌న్ నెల‌కొంది.

MAA Elections 2021: Results Will Be Delayed

అయితే లేటెస్ట్ సమాచారం ప్ర‌కారం.. విష్ణు ప్యానల్ నుంచి జయవాణి , పూజిత, మాణిక్ , హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్, లీడ్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ.. రెండు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మధ్య నున్నా నేనా అన్నట్లు పోటీ సాగింది. కాసేపట్లో ఈసీ మెంబర్స్ గెలుపుని అధికారంగా ప్రకటించనున్నారు.

Share post:

Latest