పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత బడ్జెట్ ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్?

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా ? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా! అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? మొదట ఆయన సినీ నటుడు. ఆ తరువాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి.

- Advertisement -

పవన్ సినీ నటుడు ఆయన రాజకీయ అజెండా మాకొద్దు అని ప్రకాష్ రాజ్ తెలిపారు. అలాగే నేను తెలుగు వాడిని కాదు కర్ణాటకలో పుట్టా. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో నటుడిగా ఎదిగా, అంతమాత్రాన నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని మా నియమాల్లో ఉందా? రెండు సార్లు జాతీయ అవార్డులు కూడా అందుకున్న. తొమ్మిది నంది అవార్డు తీసుకున్న. అవతలి ప్యానల్ ఎవరైనా ఉన్నారా? దీనిపై చర్చ పెడితే జనం నవ్వుతారు. ప్రకాష్ రాజ్ ఏదో ఒకటి చెప్పాలని విమర్శలు చేయడం తగదు. తెలుగు భాష గురించి ఏ స్థాయిలో మాట్లాడటానికి నేను సిద్ధమే. అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

Share post:

Popular