ధీన స్థితిలో ప్ర‌గ్యా..అర‌రే బాల‌య్య భామకు ఎంత క‌ష్ట‌మొచ్చిందీ..!?

ప్ర‌గ్యా జైస్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్యా.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసినా స‌రైన హిట్ అందుకోలేక‌పోయినా ఈ భామ‌.. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న `అఖండ‌` మూవీలో న‌టించింది.

I was scared to work with him,' says Pragya Jaiswal

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే ఇంత‌లోనే ప్ర‌గ్యా క‌రోనా బారిన పడింది. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ప్ర‌గ్యా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ధీన స్థితిలో ఏటో చూస్తూ ఉన్న త‌న పిక్ ను షేర్ చేసింది.

Akhanda: The New Poster Of Balaksrishna And Pragya Jaiswal Is Out!

అంతేకాదు, `ఈ ఐసోలేష‌న్ నుంచి ఎప్పుడు బ‌య‌ట ప‌డుతానో అని ఎదురు చూస్తున్నాను. ఆ అంద‌మైన క్షణం కోసం రోజులు లెక్క‌ పెడుతున్నాను.` అంటూ త‌న పోస్ట్‌కి ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ కూడా పెట్టుకొచ్చింది. దాంతో ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మార‌గా.. `అర‌రే ప్ర‌గ్యాకు ఎంత క‌ష్ట‌మొచ్చిందీ` అంటూ నెటిజ‌న్లు సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఇంకొంద‌రు ప్ర‌గ్యా త్వ‌ర‌గా కోలుకుని బ‌య‌ట‌కు రావాల‌ని ఆకాక్షిస్తున్నారు.

https://www.instagram.com/p/CVDe3YHMcsi/?utm_source=ig_web_copy_link

Share post:

Latest