పునీత్ ఆరోగ్యంపై మేమేం చెప్పలేం అంటున్న డాక్టర్లు..ట్వీట్ వైరల్..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్ లో పునీత్ రాజ్ ను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు, ఆయన ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం ఇప్పట్లో ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు వైద్యులు. అంతేకాదు విక్రమ్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ రంగనాథ నాయక్.. పునీత్ ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం ఇప్పట్లో అయితే ఇవ్వలేము అని , ఐసియులో చికిత్స పొందుతున్నారు అని ఆయన స్పష్టం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులంతా తీవ్ర ఆందోళనలకు గురి అవుతున్నారు. అంతేకాదు డాక్టర్లు ఏం చెప్పలేం.. పరిస్థితి చాలా విషమంగా ఉంది అనడంతో ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అలాగే ప్రేక్షకులు కూడా భయపడుతున్నారు. అంతేకాదు పునీత్ త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నారు.. ఇకపోతే పునీత్ కన్నడ సినీ ఇండస్ట్రీలో మెగా సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు దేశ వ్యాప్తంగా కూడా మంచి అభిమానులు ఉండటం గమనార్హం. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం షాక్ లోనే ఉండిపోయింది. ఇక ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest