ప‌వ‌న‌కు జోడీగా బుట్ట‌బొమ్మ ఫిక్స్‌..క‌న్ఫార్మ్ చేసేసిన డైరెక్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్‌సింగ్‌` ఒక‌టి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెర‌కెక్క‌బోతోంది.

Pawan Kalyan's 28th film titled 'Bhavadeeyudu Bhagat Singh' - The Hindu

త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించ‌బోయే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే ఎప్ప‌టి నుంచో మ‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని మాత్రం వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌ను హ‌రీష్ శంక‌ర్ క‌న్ఫార్మ్ చేసేశాడు.

Harish Shankar decides to repeat his heroine Pooja Hegde for Pawan Kalyan

తాజాగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హ‌రీష్ స్టేజ్‌పై మ‌ట్లాడుతూ.. పూజా హెగ్డే చాలా బిజీగా ఉంది. ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వ‌చ్చిందంటూ హ‌రీష్ చెప్పుకొచ్చారు. ఇక‌ పూజా ప్ర‌స్తుతం అందరి హీరోల‌తోనూ నటిస్తోంది..పవన్ కళ్యాణ్‌తో కూడా అంటూ హ‌రీష్ శంక‌ర్ చెప్పేశారు. దాంతో భవదీయుడు భగత్‌సింగ్ తో పూజా ఫిక్స్ అయింద‌ని అంద‌రికీ ఓ క్లారిటీ వ‌చ్చేసింది.