బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్ కోసం పాయ‌ల్ ప్ర‌చారాలు..ఖుషీలో ఫ్యాన్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే స‌రయు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద, శ్వేత‌లు ఎలిమినేట్ కాగా.. ఈ వారం కాజ‌ల్, సిరి, శ్రీ‌రామ్‌, ప్రియ‌, ఆనీ మాస్ట‌ర్‌, లోబో, జెస్సీ, యాంక‌ర్ ర‌విలు నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఒక‌రు దుకాణం స‌ద్దేయ‌నుండ‌గా.. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు అభిమానుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు సైతం రంగంలోకి దిగుతున్నారు.

Actress Payal Rajput Stunning Latest Pics

ఈ నేప‌థ్యంలో `ఆర్ఎక్స్ 100` మూవీతో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హాట్ భామ పాయ‌ల్ రాజ్‌పూత్‌.. సింగ‌ర్ శ్రీరామచంద్ర కోసం ప్ర‌చారాలు మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా ఓ వీడియోను వ‌దిలింది. అందులో పాయ‌ల్ మాట్లాడుతూ..`నా ఫ్రెండ్‌ శ్రీరామ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నాడు. అతడు చాలా బాగా ఆడుతున్నాడు. నేను కొన్ని ఎపిసోడ్లలో శ్రీరామ్‌ పర్ఫామెన్స్‌ చూసి ఓ మై గాడ్‌ అనుకున్నాను.

Bigg Boss Telugu 5 contestant Sreerama Chandra's profile, photos and all you know about the singer-turned-actor - Times of India

నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్‌ విషెస్‌ నీకెప్పుడూ ఉంటాయి. శ్రీరామ్‌కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి. ప్రతీ ఒక్క ఓటు కూడా విలువైనదేనని గుర్తుంచుకోండి` అని చెప్పుకొచ్చింది. ఇక శ్రీ‌రామ్‌కు పాయ‌ల్ స‌పోర్ట్ చేస్తుండ‌డంతో.. అత‌డి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Share post:

Popular