పవన్ తో సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

మన టాలీవుడ్ లో ఉండేటువంటి అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఇక దర్శకుల విషయానికి వస్తే ఇంతవరకు తన కెరియర్ లో ఒక్క ఫ్లాపులను కూడా చవి చూడని డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఇక అసలు విషయానికొస్తే వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల కిందట ఒక సినిమా లాస్ట్ వరకు వచ్చి ఆగిపోయిందట. అలాగే ఒక కాలేజ్ మీటింగ్ లో రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా విషయంపై విధంగా స్పందించాడు రాజమౌళి. పవన్ కళ్యాణ్కు కొన్నేళ్ళ క్రితం ఒక కథ చెప్పాను.. కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ మళ్లీ చెబుతానని తెలియజేశారు.

కానీ ఆయన నుంచి నాకు ఎటువంటి రెస్పాండ్ రాకపోతే ఆ తరువాత సినిమాను వదిలేయాల్సి వచ్చింది అని తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ కు సినిమాల కంటే రాజకీయమే ఎక్కువ మక్కువ ఉండడంతో ఆ సినిమాని పక్కన పెట్టాల్సి వచ్చిందని రాజమౌళి షాకింగ్ కామెంట్ చేశారు. కానీ ఎప్పటికైనా నా ఒక సినిమా చేస్తానని తెలియజేశారు.