భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది.

గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ సాంగ్ ను సీనియర్ సింగర్ చిత్ర పాడింది.ఈ ఫుల్ సాంగ్ దసరా సందర్భంగా రేపు యూట్యూబ్ లో విడుదల కానుంది.’అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు నామీన’ అంటూ సాగే మెలోడీ సాంగ్ అద్భుతంగా ఉంది. సీనియర్ సింగర్ చిత్ర తనదైన శైలిలో ఈ పాటను అద్భుతంగా పాడారు. ప్రోమో కొన్ని సెకండ్ల ఉన్నప్పటికీ సాంగ్ మాత్రం అదిరిపోయేలా ఉంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ సాంగ్ కూడా ఇప్పటిదాకా 49 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.

Share post:

Popular