సరికొత్త ఫీట్ అందుకున్న నివేదా థామస్..నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు!

October 24, 2021 at 7:59 am

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జెంటిల్ మేన్` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. జై లవకుశ, బ్రోచేవారెవరురా, దర్బార్ వంటి చిత్రాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన వకీల్‌ సాబ్ చిత్రంలోనూ నివేథా అద‌ర‌గొట్టేసింది.

Image

ప్ర‌స్తుతం ఆచి తూచి సినిమాల‌ను ఎంచుకుంటున్న నివేదా తాజాగా స‌రికొత్త ఫీట్‌ను అందుకుంది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారోను నివేదా థామస్ అధిరోహించింది. కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. అంత‌టి ఎత్తుతైన ప‌ర్వ‌తాన్ని అధిరోహించడం సాహసంతో కూడినది.

Image

అయినప్పటికీ వెనుకంజ వేయకుండా, దాదాపు 6 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా థామస్ తన కల నెరవేర్చుకుంది. కిలిమంజారోని అధిరోహించిన నివేదా.. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసి నివేదా ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. దాంతో నివేదాపై ప‌లువురు సెల‌బ్రెటీలు మ‌రియు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

సరికొత్త ఫీట్ అందుకున్న నివేదా థామస్..నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts