`మా` ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి..వివరాలు ఇవే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​(మా) ఎన్నిక‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలింది. ఈ సారి ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌లు పోటీ ప‌డుతుండ‌గా.. ఇప్ప‌టికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో మా వేడెక్కిపోతోంది.

 తెలుగు నటీనటుల కోసం ఏర్పాటైన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ది పాతికేళ్లకు పైగా ప్రస్థానం. తెలుగు సినీ రంగంలోని నటీనటులు సంబంధించిన వివాదాలు, సమస్యల పరిష్కారం, సభ్యుల సంక్షేమం కోసం ‘మా’ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. 1993లో ఈ సంఘం ఏర్పాటైంది. ఈ సంఘం ఏర్పాటు చేయాలని అప్పుడు విశాఖలో పోలీస్ శాక సహాయార్ధం క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు కలెక్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తోన్న క్రమంలో మురళీ మోహన్, చిరంజీవి కలిసి ఈ సంఘం ఏర్పాటు చేయాలన్న ఆలోచనjకు బీజం పడింది.  (Twitter/Photo)

ఇదిలా ఉంటే.. మా ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.71లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. మొత్తం మూడు గదుల్లో 12 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

 ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA Elections 2021) ఎన్నికల గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఏ రోజైతే ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకొచ్చి తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడుతున్నానని ప్రకటించాడో.. అప్పట్నుంచీ అదే హీట్ కనిపిస్తుంది. ఆ తర్వాత లోకల్ చంటిగాడు అంటూ మంచు విష్ణు.. ‘మా’ ఎన్నికల బరిలో దిగడంతో హీట్ మరింత పెరగింది. (Twitter/Photo)

ఒక గదిలో ఒకేసారి నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని క‌ల్పించారు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 883 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే జూబ్లీహిల్స్‌ పోలీసులు పోలింగ్ కేంద్రం వ‌ద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఎన్నిక‌ల ఫ‌లితాలు అక్టోబ‌ర్ 11న రానున్నాయి.