అర‌రే..అల్లు అర్జున్ ఏంటీ ఇలా బుక్కైయ్యాడు..? నెటిజ‌న్ల ట్రోలింగ్‌!

ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`తో బిజీ బిజీగా గ‌డుపుతున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. నెటిజ‌న్ల చేతిలో ఊహించ‌ని విధంగా బుక్కైయ్యాడు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..శ్రీ చైతన్య విద్యా సంస్థ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విద్య సంస్థ అయిన‌ శ్రీచైతన్య విద్యా సంస్థ తమ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌ను నియమించింది.

Telugu Movie Ratings and Tollywood Reviews | Mirchi9

ఇందుకు సంబంధించిన యాడ్ ను దసరా సందర్భంగా విడుదల చేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ `ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య` అని చెప్పడంతో పాటు `మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడం లో మాత్రమ్ తగ్గేదే లే` అంటూ డైలాగ్ చెప్పాడు. అలాగే ఇందుకు సంబంధించిన కొన్ని పేపర్ యాడ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Allu Arjun Becomes 'Sri Chaitanya' Brand Ambassador -

వాటిల్లో ఐఐటీ ర్యాంకర్స్ ప్రక్కన పోజ్ ఇస్తూ అల్లు అర్జన్ నిలబడ్డారు. అంతేకాదు, బ‌న్నీకి ప‌క్క‌నే ఆల్ ఇండియా ఐఐటీ నెంబర్ వన్ ర్యాంక్ అని కూడా రాసి ఉంది. దాంతో బ‌న్నీని నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ వయసులో బన్నీ ఐఐటీ నంబర్ వన్ ర్యాంక్ ని సాధించడం అంత సులువేమీ కాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Popular