సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఎక్క‌డ ఉంటున్నాడో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఈ జంట త‌మ వైవాహిక జీవితానికి విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవాడు.

- Advertisement -

Naga Chaitanya and Samantha to own a lavish farmhouse in Goa - TeluguBulletin.com

కానీ, సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఫ్యామిలీతో కాకుండా ఓ స్టార్ హోటల్ లో ఉంటున్నాడ‌ట‌. అయితే ఎక్కువ రోజుల పాటు హోట‌ల్‌లో ఉండ‌లేక‌.. తాజాగా చైతు హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి కొన్ని రోజుల్లోనే కొత్త‌ అపార్ట్మెంట్ లోకి చైతు షిఫ్ట్ అవ్వనున్నాడ‌ని స‌మాచారం.

Did you know Samantha Akkineni and Naga Chaitanya are building a lavish farmhouse in Goa?

కాగా, సామ్‌-చైతులు గ‌త ఏడాది జూబ్లిహిల్స్ లో ఓ పెద్ద బంగ్లా ను కూడా కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ బంగ్లాకు రెనొవేష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అది రెడీ అయిన వెంట‌నే అక్క‌డ‌కు షిఫ్ట్ అవుదామ‌ని చైతు-సామ్‌లు అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే వీరి బంధానికి బీట‌లు వారాయి.

Share post:

Popular