నాగ‌బాబు సంచల‌న నిర్ణ‌యం..ఇక సెల‌వంటూ షాకింగ్ ట్వీట్‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి.

అయితే మంచు విష్ణు గెలిచిన కొద్ది సేప‌టికే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు ట్విట్ట‌ర్ ద్వారా ప్రకటించారు. `ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్‌లో “నా“ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు`అంటూ ట్వీట్‌ చేశారు.

అంతేకాదు, 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు. ఎంతగానో ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మొద‌టి నుంచీ ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కే నాగ‌బాబు స‌పోర్ట్ చేశారు. కానీ, చివ‌ర‌కు మా పోరులో మంచు విష్ణునే విష‌యం సాధించాడు. ఈ నేప‌థ్యంలోనే నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశార‌ని టాక్‌.

Share post:

Latest