మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో `మా` నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రయానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చారు.
అలాగే శివ బాలాజీ భార్య, నటి మధుమిత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు.. శివబాలాజీ భార్య మధుమితపై మండిపడ్డారు. అంతేకాదు, ఆమెకు స్ట్రోంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. కుమారిడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మోహన్ బాబు మైక్ అందుకుని తనదైన శైలిలో భారీ స్పీచ్ ఇచ్చారు.
అయితే మోహన్ బాబు ప్రసంగిస్తుండగా.. మధుమిత ఆయన వెనక అటూ ఇటూ కదులుతూ ఎవరితోనూ గుసగుసలు ఆడింది. దాంతో మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఈ క్రమంలోనే స్పీచ్ మధ్యలో వెనుక నుంచి మాట్లాడవద్దంటూ మధుమితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలు స్పీచ్ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని, శ్రద్ద దెబ్బ తింటుంది.. అలా చేయకు అంటూ మధుమితకు వార్నింగ్ ఇచ్చారు మోహన్ బాబు.