మొదలైంది ఓంకారతాండవంమంటున్న రజిని పెద్దన్న..పోస్టర్ వీడియో..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం  ”అన్నాత్తే”.. ఈ సినిమా ని మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఇదే సినిమాని తెలుగులో పెద్దన్న అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన తమిళ్ మోషన్ పోస్టర్.. టీజర్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా తెలుగు మోషన్ పోస్టర్ ని కూడా మేకర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ టీజర్ విషయానికొస్తే రజనీకాంత్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇందులో ప్రకాష్రాజ్ జగపతిబాబు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మొదలైంది ఓంకార తాండవం వన్ అని బ్యాగ్రౌండ్ వాయిస్తూ ఈ టీజర్ విడుదల కావడం వల్ల. రజనీకాంత్ అభిమానులు ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక అంతే కాకుండా రజనీకాంత్ పంచెకట్టులో బైక్పై కూర్చొని చేత్తో కత్తి పట్టుకుని ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ ఈ సినిమాకే హైలెట్ గా ఉండబోతోంది.

Share post:

Latest