మెగాస్టార్ ను నోరెత్తకుండా కౌంటర్ ఇచ్చినా మోహన్ బాబు..?

తాజా మెగాస్టార్ చిరంజీవి మీద మోహన్ బాబు పరోక్షంగా ఈ రోజు కొన్ని కౌంటర్లు వేశారు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ పెళ్లిసందడి వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద పరోక్షంగా పంచులు వేశారు.

- Advertisement -

కొందరు రెండేళ్ల పదవి.. చిన్న పదవి అంటూ మా అధ్యక్ష పదవి తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని.. కానీ రెండేళ్ళ పదవి అయినా ఎంతో బాధ్యతతోనే చేసే పని ఇదని.. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి అందరూ గౌరవం ఇవ్వాలని మోహన్ బాబు తెలియజేశారు. ఇక పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ రెండేళ్ల పదవి, చిన్న పదవి కి ఇన్ని గొడవలు ఎందుకని, అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

కొద్ది రోజుల కిందట ఒక టీవీ ఛానల్లో తన కొడుకుని పోటీ నుంచి తప్పుకోవాలని కొంతమంది మోహన్ బాబుకి చెప్పడంతో తనను చాలా బాధ పెట్టినట్లు చేశారని తెలియజేశాడు. ఇదేం స్నేహం అంటూ పరోక్షంగా చిరంజీవి మీద కూడా తన అసహనాన్ని చూపించారు. ఇక అప్పట్లో కూడా సినిమా వజ్రోత్సవాల సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద అగాధమే జరిగింది. దీంతో వీరు కొన్ని సంవత్సరాలపాటు మాట్లాడుకోలేదు. మరి ఇప్పుడైనా కలుస్తారా లేదో ఏమో వేచి చూడాల్సిందే.

Share post:

Popular