రిపబ్లిక్ టీంకు మెగాస్టార్ విషెస్?

హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. ఈ పబ్లిక్ సినిమా నేడు విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విజయవంతం కావాలని స్పెషల్ గా ఈ సినిమా టీంకు విషెస్ తెలిపారు. అలాగే ఈ సందర్భంగా స్పెషల్ గా ట్వీట్ కూడా చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు.

- Advertisement -

అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందుతుందని ఆశిస్తూ ఆ చిత్రం యూత్ అందరికి నా శుభా శుభాకాంక్షలు.. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడిన ఈ సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ కి రిపబ్లిక్ సినిమా విజయం కూడా కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుంది అని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ప్రముఖ దర్శకుడు దేవకట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోను ముందురోజు రాత్రి ప్రదర్శించగా ఆ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. సినిమా విజయవంతం కావాలని సోషల్ మీడియాలో మెగాస్టార్ తో పాటు మెగా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్.

Share post:

Popular