హీరో సుధీర్ బాబు భార్య బర్త్ డే సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని గురించి పరిచయం అక్కర్లేదు. ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి.

- Advertisement -

ఈ సెలబ్రేషన్స్ కు సూపర్ కృష్ణ తోపాటు మంజుల, ఇంకా పలువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. పుట్టినరోజు సంబంధించిన ఫోటోలు పెట్టడానికి మీడియాలో వైరల్ అయ్యాయి.

 

హీరో సుధీర్ బాబు కూడా తన భార్యకు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే ప్రియా నీతో ప్రతి సంవత్సరం మునుపటి ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది.

ప్రతిరోజు కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ప్రేమను పంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ శ్రీమతికి ప్రేమగా బర్త్ డే విషెస్ తెలియజేశారు సుధీర్ బాబు. ఈ బర్త్ డే కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, వాటిని చూసి మహేష్ అభిమానులు ఎంతగానో ఉత్సాహపడుతున్నారు.

Share post:

Popular