సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మోహన్ బాబు, విష్ణు.. అందుకోసమేనా?

మా ఎన్నికలు రోజురోజుకీ ఆసక్తి గా మారుతున్నాయి.అంతేకాకుండా మా ఎన్నికల సమయం కూడా దగ్గరపడుతోంది. మా ఎన్నికలు ఎప్పుడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ సారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీపడుతున్నారు. సెప్టెంబర్ 27న నామినేషన్లు కూడా ముగిసాయి.దీనితో ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆరయా ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ అయిపోయారు.

ఈ నేపథ్యంలో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు పరిశ్రమల పెద్దల మద్దతు కోరుతున్నారు. తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ తో కలిసి సూపర్ స్టార్ కృష్ణ ను కలిశారు. అంతేకాకుండా మంచు విష్ణు తో పాటు తన తండ్రి మంచు మోహన్ బాబు కూడా ఉన్నారు. ఈ మా ఎన్నికలలో మంచు విష్ణు కి మద్దతు ఇవ్వాల్సిందిగా కృష్ణ ను మోహన్ బాబు విష్ణు కోరారు. ఈ విషయంపై స్పందించిన కృష్ణ అందుకు మంచు విష్ణు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.

Share post:

Latest