బాలయ్య మద్దతు మంచు విష్ణుకే.. మా ఎన్నికలు అతనిదే గెలుపు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో మనందరికి తెలిసిందే. మా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న వారికి టెన్షన్ మొదలయింది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి పివీఎల్ నరసింహారావు , జనరల్ సెక్రటరీ పదవికి బండ్ల గణేష్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. అయితే తాజాగా హీరో బాలకృష్ణ తనకి మద్దతు ఇస్తున్నారని మంచు విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తో దిగిన ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు మంచు విష్ణు.

నన్ను ఆశీర్వదించి, మా ప్రెసిడెంట్ గా నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు బాల అన్న అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. బాలకృష్ణ కోసం అఖండ సెట్ కు వెళ్ళిన మంచు విష్ణు ఈ సందర్భంగా ఆయనతో సరదాగా ముచ్చటించారు. ఇప్పటికే సివీఎల్ పోటీ నుంచి తప్పుకోవడంతో మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, అలాగే మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ నెలకొంది.