మా ఎన్నికల పై సంచలన ట్వీట్ చేసిన మంచు విష్ణు..!

నిన్నటి రోజున మా ఎలక్షన్ల ఫలితాలు రావడం ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా మా సభ్యత్వం లో నుంచి వైదొలగాలని చూస్తున్నారు.ఇదే తంతులు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా తన ట్విట్టర్ నుంచి ఇలా పోస్ట్ చేశాడు.

“అందరికీ శుభోదయం.. నా సినిమా సోదరులు నా పై చూపించిన ప్రేమకు మరియు వాళ్లు నాకు ఇచ్చిన మద్దతు కు నేను వినయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను..”మా ఎన్నికలపై నేను ఏదైనా చెప్పేముందు, ఈసి సభ్యులు, జాయింట్ సెక్రెటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ పోస్టులో ఒకదానికి కౌంటింగ్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది.

కాబట్టి ఆ కౌంటింగ్ పూర్తయ్యాక మాట్లాడుతాను అంటూ విష్ణు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మంచు విష్ణు మా ఎన్నికలలో మొదటినుంచి ఆదిత్యం లోనే కొనసాగిస్తూ చివరిగా ప్రకాష్ రాజ్ పై గెలుపొందాడు.

Share post:

Popular